జనగామ సీఐపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?
దిశ, జనగామ: భూవివాదంలో తలదూర్చి బెదిరింపులకు పాల్పడిన జనగామ సీఐ బాలాజీ వరప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని శనివారం ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా అధ్యక్షుడు ధర్మభిక్షం ఎచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ధర్మభిక్షం మాట్లాడుతూ.. జనగామ సీఐ ఆయనకు సంబంధం లేదని, తన పరిధి కాని భూ వివాదాల్లో తలదూర్చి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. అంతేగాకుండా.. అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే సీఐపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌కి […]
దిశ, జనగామ: భూవివాదంలో తలదూర్చి బెదిరింపులకు పాల్పడిన జనగామ సీఐ బాలాజీ వరప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని శనివారం ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా అధ్యక్షుడు ధర్మభిక్షం ఎచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ధర్మభిక్షం మాట్లాడుతూ.. జనగామ సీఐ ఆయనకు సంబంధం లేదని, తన పరిధి కాని భూ వివాదాల్లో తలదూర్చి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. అంతేగాకుండా.. అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే సీఐపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చట్టం అందరికీ సమానమే అని, ఒకరికి చుట్టం మరొకరికి శత్రుత్వం కాదని రాజ్యాంగం చెప్తుంటే సదరు సీఐ మాత్రం అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలకు అండగా నిలుస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, వెంటనే సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు.