జపాన్‌లో పాపులర్ గేమ్‌గా.. ‘పిల్లో ఫైట్’!
దిశ, ఫీచర్స్: అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు, స్నేహితులు సరదాగా ‘దిండ్ల’తో ఫైట్ చేస్తుంటారు. ఒకరిపైకి ఒకరు విసురుకుంటూ, తమ బలాన్ని ప్రదర్శిస్తూ ఆడుకుంటారు. అయితే ఇది ఇంటికి మాత్రమే పరిమితమైన ఫ్రెండ్లీ కాంపిటీషన్. కానీ, ప్రపంచవ్యాప్తంగా ‘పిల్లో ఫైట్స్’ జరుగుతాయని తెలుసా? చాలా దేశాల్లో ఇదీ ఓ ఫన్నీ గేమ్ కావచ్చు, కానీ.. జపాన్‌లో మాత్రం ఇది జాతీయస్థాయి క్రీడగా గుర్తింపు పొందగా.. ప్రతి ఏటా ‘ఇటో’లో నిర్వహించే ‘ఆల్-జపాన్ పిల్లో ఫైట్’ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు స్థానికులతోపాటు ప్రపంచ […]
దిశ, ఫీచర్స్: అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు, స్నేహితులు సరదాగా ‘దిండ్ల’తో ఫైట్ చేస్తుంటారు. ఒకరిపైకి ఒకరు విసురుకుంటూ, తమ బలాన్ని ప్రదర్శిస్తూ ఆడుకుంటారు. అయితే ఇది ఇంటికి మాత్రమే పరిమితమైన ఫ్రెండ్లీ కాంపిటీషన్. కానీ, ప్రపంచవ్యాప్తంగా ‘పిల్లో ఫైట్స్’ జరుగుతాయని తెలుసా? చాలా దేశాల్లో ఇదీ ఓ ఫన్నీ గేమ్ కావచ్చు, కానీ.. జపాన్‌లో మాత్రం ఇది జాతీయస్థాయి క్రీడగా గుర్తింపు పొందగా.. ప్రతి ఏటా ‘ఇటో’లో నిర్వహించే ‘ఆల్-జపాన్ పిల్లో ఫైట్’ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు స్థానికులతోపాటు ప్రపంచ నలుమూలల నుంచి పిల్లో ఫైటర్స్ వస్తుంటారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారు ‘పిల్లో ఫైట్’లో పాల్గొనేందుకు అర్హులే. ఇతర దేశీయులు దీన్నో సిల్లీ కాంపిటీషన్‌గా తీసుకున్నా, జపానీయులు మాత్రం పాఠశాల స్థాయి నుంచే సీరియస్‌గా ఆటను ప్రాక్టీస్ చేస్తారు. అంతేకాదు అందుకోసం క్రీడాకారులు శిక్షణ కూడా పొందుతారు. ఇక ‘పిల్లో ఫైట్ టోర్నమెంట్’ 2013లో ప్రారంభం కాగా మరుసటి ఏడాది 2014లో ఈ కాంపిటీషన్ జాతీయ స్థాయికి చేరుకోవడం విశేషం. అయితే మొదట్లో షిజుయోకాలోని విద్యార్థుల బృందం ఈ ఆటను పోటీ రూపంలో ఆడగా, ఆటలో చాలా సరళమైన నియమాలు రూపొందించారు. ఈ ఆట ఆడే ప్లేయర్స్ సాధారణంగా ‘యుకాటాస్’ అనే సాంప్రదాయ జపనీస్ దుస్తులను ధరిస్తారు. ముందుగా టీమ్ సభ్యులు రిఫరీ విజిల్ వేసిన వెంటనే నిద్రపోతున్నట్లు నటిస్తారు. ఆ తర్వాత వెంటనే అప్రమత్తమై ఇతర జట్టును దిండులతో కొడుతూ.. ప్రత్యర్థి జట్టు సభ్యులను, ప్రత్యేకించి కెప్టెన్‌ని ఓడించడమే లక్ష్యంగా గేమ్ సాగుతోంది. కెప్టెన్ అవుట్ అయితే మొత్తం గ్రూప్ అవుట్‌గా పరిగణిస్తారు. ప్రతి జట్టులోని ఆటగాడు తమ జట్టును, ముఖ్యంగా కెప్టెన్‌ను రక్షించడానికి బొంతను ఉపయోగించవచ్చు. రెండు ‘రెండు నిమిషాల’ రౌండ్లు గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది.
2014 తర్వాత జపనీస్ కంపెనీ మకురా కబుషిగైషా ‘పిల్లో ఫైట్’ కోసం ప్రత్యేకంగా ఓ దిండును విడుదల చేసింది. ఇది చాంపియన్‌షిప్‌ల సమయంలో అధికారికంగా గుర్తింపు పొందిన ఏకైక దిండు కాగా దీని ధర సుమారు 3,150 యెన్ ($ 30). ఇక పోటీలో విజేత జట్టుకు 100,000 యెన్ ($ 915) బహుమతిగా అందిస్తారు.