జీతమడిగితే చిల్లర ఇచ్చిన కంపెనీ.. తర్వాత ఏం జరిగిందంటే.?

దిశ, ఫీచర్స్ : ఒక్కోసారి ఏదైనా సంస్థ లేదా కంపెనీ.. తమ ఉద్యోగులకు జీతమిచ్చేందుకు వెనుకా ముందు ఆలోచిస్తుంటుంది. పలు కంపెనీలు లాభాల్లో ఉన్నా సరే, ఏదోలా వర్కర్స్ జీతం డబ్బులు ఎగ్గొట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే అనవసర నిబంధనలు తెరపైకి తెస్తుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఫిలీప్పీన్స్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఓ కంపెనీ తన వర్కర్‌కు ఇవ్వాల్సిన డబ్బు మొత్తాన్ని చిల్లర రూపంలో చెల్లించింది. ఇక ఆ చిల్లర బ్యాగులకు చెందిన వీడియో నెట్టింట వైరల్ […]

Update: 2021-07-05 02:23 GMT

దిశ, ఫీచర్స్ : ఒక్కోసారి ఏదైనా సంస్థ లేదా కంపెనీ.. తమ ఉద్యోగులకు జీతమిచ్చేందుకు వెనుకా ముందు ఆలోచిస్తుంటుంది. పలు కంపెనీలు లాభాల్లో ఉన్నా సరే, ఏదోలా వర్కర్స్ జీతం డబ్బులు ఎగ్గొట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే అనవసర నిబంధనలు తెరపైకి తెస్తుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఫిలీప్పీన్స్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఓ కంపెనీ తన వర్కర్‌కు ఇవ్వాల్సిన డబ్బు మొత్తాన్ని చిల్లర రూపంలో చెల్లించింది. ఇక ఆ చిల్లర బ్యాగులకు చెందిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. సదరు కంపెనీ బిజినెస్ పర్మిట్ రద్దయింది.

ఫిలిప్పీన్స్‌కు చెందిన రసెల్ మనోసా అనే వ్యక్తి.. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీ ‘నెక్స్‌గ్రీన్ ఎంటర్‌ప్రైజెస్ ఫ్యాక్టరీ’లో రెండు రోజులు పనిచేశాడు. అయితే తనకు రావాల్సిన జీతం డబ్బులను కంపెనీ రెండు బ్యాగుల్లో నింపి చిల్లర రూపంలో ఇచ్చింది. ఈ పిక్చర్స్‌ను అతడి కజిన్ ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో వైరల్ కాగా.. విషయం కాస్త స్థానిక మేయర్ దృష్టికి వెళ్లింది. మేయర్ ఈ విషయాన్ని ఆరా తీయగా.. కంపెనీ క్యాషియర్ ఆ చిల్లరంతా బ్యాంకులో మార్చుకోమన్నాడనే విషయాన్ని రసెల్ చెప్పాడు.

మరోవైపు ఈ ఇన్సిడెంట్‌ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో మేయర్, కంపెనీ ప్రతినిధితో సమావేశమయ్యారు. ఇది వలెంజులా సిటీ గవర్నమెంట్ ఫేస్‌బుక్ పేజీతో పాటు లోకల్ మీడియాలోనూ లైవ్ స్ట్రీమ్ అయింది. చిల్లర రూపంలో జీతం చెల్లించి, ఉద్యోగిని ఎందుకు అవమానించారని నగర మేయర్ కంపెనీ ప్రతినిధిని ప్రశ్నించగా.. పొరపాటున అలా జరిగిందని సమాధానమిచ్చాడు. ఈ జవాబుతో కన్విన్స్ కాని మేయర్, రసెల్.. ఉద్యోగుల పట్ల కంపెనీ తీరుపై ఫిలిప్పీన్స్ లేబర్ సెక్రెటరీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇన్వెస్టిగేషన్ చేపట్టగా.. ఆలోగానే మేయర్ గచ్చాలిన్ సదరు కంపెనీ బిజినెస్ పర్మిట్‌ను రద్దు చేశాడు.

Tags:    

Similar News