ఉద్యోగుల శ్రమకు గుర్తింపు.. కార్లను కానుకిచ్చిన కంపెనీ

దిశ, వెబ్‌డెస్క్: ‘సక్సెఫుల్ బిజినెస్, బోనసెస్, ప్రాఫిట్స్, హైక్స్’.. ఇలాంటి మాటలు 2020లో ఆశించకూడదు. ఎందుకంటే కరోనా వల్ల చాలా వ్యాపారాలు ఆర్థికంగా నష్టపోవడంతో.. ఈ ఏడాది చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్‌లు, హైక్‌లు ఇచ్చే పొజిషన్‌లో లేవు. ఇప్పుడిప్పుడే చక్కబడుతున్న తమ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే పనిలో పడ్డాయి. అయితే, చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం.. తమ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు సర్‌ప్రైజ్ బహుమతులను అందించి.. కరోనా గడ్డు […]

Update: 2020-10-06 04:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘సక్సెఫుల్ బిజినెస్, బోనసెస్, ప్రాఫిట్స్, హైక్స్’.. ఇలాంటి మాటలు 2020లో ఆశించకూడదు. ఎందుకంటే కరోనా వల్ల చాలా వ్యాపారాలు ఆర్థికంగా నష్టపోవడంతో.. ఈ ఏడాది చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్‌లు, హైక్‌లు ఇచ్చే పొజిషన్‌లో లేవు. ఇప్పుడిప్పుడే చక్కబడుతున్న తమ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే పనిలో పడ్డాయి. అయితే, చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం.. తమ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు సర్‌ప్రైజ్ బహుమతులను అందించి.. కరోనా గడ్డు కాలంలోనూ ఔరా అనిపించింది.

చైనాకు చెందిన ‘జియాంగ్జీ వెస్ట్ డాజి ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్ (Jiangxi West Dajiu Iron & Steel Corporation)’ కరోనా సయమంలోనూ మంచి ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఏడాదే కాదు.. గత నాలుగు సంవత్సరాలుగా ఆ సంస్థ లాభాల బాటలోనే ఉంది. కాగా, తమ ఉద్యోగుల కృషి ఫలితంగా లాభాలు రావడంతో కంపెనీ మేనేజ్‌మెంట్ అక్టోబర్ 1(చైనా నేషనల్ డే) సందర్భంగా సెలబ్రేషన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే తమ ఉద్యోగులకు మంచి బహుమతులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న మేనేజ్‌మెంట్.. 4,116 మంది ఉద్యోగులకు విలువైన కార్లను బహుమతిగా ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

తమ కంపెనీ విజయాలలో భాగమైన ఉద్యోగులకు ఇది ప్రత్యేక కృతజ్ఞత అని మేనేజ్‌మెంట్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. 2,933 జియాంగ్లింగ్ ఫోర్ట్ టెర్రిటోరి, 1183 ఫా వోక్స్‌వ్యాగన్ మగోటన్ కార్లను మొత్తంగా 4116 మంది ఉద్యోగులకు డిస్ట్రబ్యూట్ చేశారు. ఇందుకోసం 74 మిలియన్ డాలర్లు (రూ. 5,43,36,72,000.00 ) ఖర్చు చేసింది. అంతేకాదు, ఆ కార్ల లైసెన్స్ ప్లేట్లకు కావాల్సిన ఖర్చును కూడా తామే భరిస్తామని ఉద్యోగులకు హామీ ఇవ్వడంతో పాటు 5 సంవత్సరాల ఆటో ఇన్సూరెన్స్, వెహికల్ టాక్సెస్ కూడా కంపెనీయే భరించనున్నట్టు వెల్లడించింది. ఈ బిగ్ సెలబ్రేషన్ ఈవెంట్‌ను ఓపెన్ స్పేస్‌లో అరెంజ్ చేసిన కంపెనీ.. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసింది.

కరోనా సమయంలో వేలాది కంపెనీలు తమ ఉద్యోగులను తీసేయడం, శాలరీలు తగ్గించడం లాంటి చర్యలను చూశాం. కానీ.. ఉద్యోగులపై వరాల జల్లులు కురిపించడం నిజంగా అరుదైన ఘటనే. మన దేశంలోనూ సూరత్ వజ్రాల వ్యాపారి ఇలానే తమ ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇస్తుంటాడు.

Tags:    

Similar News