నిత్యావసరాలపై అధికారుల కమిటీ
జీవో నం. 46లో తెలిపిన ప్రభుత్వం దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అందరికీ నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాల అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వం వహిస్తారని తెలిపింది. సోమవారం ప్రభుత్వం ఈ మేరకు జీవో నం.46 జారీ చేసింది. నిత్యావసరాలపై ఏర్పాటు చేసిన ఈ కమిటీలో పౌరసరఫరాల శాఖ కమిషనర్, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్, […]
జీవో నం. 46లో తెలిపిన ప్రభుత్వం
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అందరికీ నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాల అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వం వహిస్తారని తెలిపింది. సోమవారం ప్రభుత్వం ఈ మేరకు జీవో నం.46 జారీ చేసింది. నిత్యావసరాలపై ఏర్పాటు చేసిన ఈ కమిటీలో పౌరసరఫరాల శాఖ కమిషనర్, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్, ఐజీ హైదరాబాద్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, హార్టీకల్చర్ డైరెక్టర్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్, డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
Tags: corona, lockdown, essential commodities, officers committee