ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ

దిశ, సిద్దిపేట: తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. కోవిడ్ 19 నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, శానిటైజర్ బాటిల్ వెంబడి ఉంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి, ఆనందోత్సహాల మధ్య బతుకమ్మ పండుగ, […]

Update: 2020-10-23 11:06 GMT

దిశ, సిద్దిపేట:
తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. కోవిడ్ 19 నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, శానిటైజర్ బాటిల్ వెంబడి ఉంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి, ఆనందోత్సహాల మధ్య బతుకమ్మ పండుగ, దసరా పండుగ జరుపుకోవాలని సూచించారు. పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు.

Tags:    

Similar News