విమర్శల పాలవుతున్న కేటీఆర్, స్మితా సబర్వాల్

దిశ, తెలంగాణ బ్యూరో : “రాష్ట్రంలో బంజారాహిల్స్​లో ఉండేవారైనా… మారుమూల తండాల్లో ఉండేవారైనా తాగేనీళ్లు ఒక్కటే. అవే మిషన్​ భగీరథ నీళ్లు.” అంటూ సీఎం కేసీఆర్​ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ‘ఇక నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో మిషన్​భగీరథ నీళ్లను రాగి బాటిళ్లలో వాడాలని మంత్రి కేటీఆర్, మిషన్​భగీరథ స్పెషలాఫీసర్​ స్మితా సబర్వాల్​ వెల్లడించారు.’ కానీ అవన్నీ ఉత్తి ప్రకటనలేనని తేలిపోయాయి. ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి సమావేశంలోనూ ప్రైవేట్​ కంపెనీలకు చెందిన ప్లాస్టిక్ […]

Update: 2021-06-26 08:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : “రాష్ట్రంలో బంజారాహిల్స్​లో ఉండేవారైనా… మారుమూల తండాల్లో ఉండేవారైనా తాగేనీళ్లు ఒక్కటే. అవే మిషన్​ భగీరథ నీళ్లు.” అంటూ సీఎం కేసీఆర్​ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ‘ఇక నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో మిషన్​భగీరథ నీళ్లను రాగి బాటిళ్లలో వాడాలని మంత్రి కేటీఆర్, మిషన్​భగీరథ స్పెషలాఫీసర్​ స్మితా సబర్వాల్​ వెల్లడించారు.’ కానీ అవన్నీ ఉత్తి ప్రకటనలేనని తేలిపోయాయి. ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి సమావేశంలోనూ ప్రైవేట్​ కంపెనీలకు చెందిన ప్లాస్టిక్ ​వాటర్​బాటిళ్లే దర్శనమిస్తున్నాయి.

ఇటీవల సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ పర్యటనతో పాటు వాసాలమర్రిలో సీఎం సభకు భారీ ఎత్తున ప్రైవేట్​ కంపెనీలకు చెందిన నీళ్ల బాటిళ్లను వినియోగించారు. వాసాలమర్రిలో కూడా గ్రామస్థులతో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేయగా… అక్కడ కూడా ఓ కంపెనీకి చెందిన వాటర్​బాటిళ్లను ఏర్పాటు చేశారు. అటు బీఆర్‌కే భవన్​లో సమావేశాలకు కూడా మిషన్​భగీరథ నీళ్లను వాడటం లేదు. దీంతో కేటీఆర్, స్మితా సబర్వాల్‌లపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Tags:    

Similar News