ప్రశాంతంగా ల‌క్కీడ్రా.. విజేత‌ల‌ను ఎంపిక చేసిన క‌లెక్టర్లు

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో మ‌ద్యం ద‌ర‌ఖాస్తుల ల‌క్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది. వ‌రంగ‌ల్ డివిజ‌న్‌లో 294 మద్యం దుకాణాలు ఉండ‌గా.. 292 దుకాణాల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించారు. 292 మద్యం దుకాణాల‌కు 9765 ద‌ర‌ఖాస్తులు అందగా శ‌నివారం ఆయా జిల్లా కేంద్రాల్లో ల‌క్కీ డ్రా నిర్వహించి విజేత‌ల‌ను ప్రక‌టించారు. ల‌క్కీ డ్రా కార్యక్రమాలు జిల్లా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో జ‌రగ‌గా క‌లెక్టర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వ‌రంగ‌ల్ డ్రా కార్యక్రమంలో క‌లెక్టర్ గోపి, […]

Update: 2021-11-20 10:35 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో మ‌ద్యం ద‌ర‌ఖాస్తుల ల‌క్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది. వ‌రంగ‌ల్ డివిజ‌న్‌లో 294 మద్యం దుకాణాలు ఉండ‌గా.. 292 దుకాణాల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించారు. 292 మద్యం దుకాణాల‌కు 9765 ద‌ర‌ఖాస్తులు అందగా శ‌నివారం ఆయా జిల్లా కేంద్రాల్లో ల‌క్కీ డ్రా నిర్వహించి విజేత‌ల‌ను ప్రక‌టించారు. ల‌క్కీ డ్రా కార్యక్రమాలు జిల్లా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో జ‌రగ‌గా క‌లెక్టర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వ‌రంగ‌ల్ డ్రా కార్యక్రమంలో క‌లెక్టర్ గోపి, హ‌న్మకొండ జిల్లా డ్రాలో క‌లెక్టర్ రాజీవ్‌గాంధీ హ‌నుమంతు, మ‌హ‌బూబాబాద్‌లో క‌లెక్టర్ శంశాక‌, జ‌న‌గామ‌లో క‌లెక్టర్ శివ‌లింగ‌య్య, భూపాల‌ప‌ల్లిలో క‌లెక్టర్‌ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ద‌ర‌ఖాస్తుదారుల స‌మ‌క్షంలో క‌లెక్టర్లు టోకెన్లను తీసి విజేత‌ల‌ను ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News