12 గంటల్లో ధాన్యం అన్‌లోడ్ చేయాలి

దిశ, మెదక్: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి జిల్లాలోని రైస్ మిల్లర్ల యజమానులతో బుధవారం సమావేశం అయ్యారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్‌పై ఆయన చర్చించారు. 333 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి 44 రైస్ మిల్లులకు ధాన్యం చేరవేసేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు చేరగానే 12 గంటలలోపు లారీల నుంచి అన్ లోడింగ్ చేయాలన్నారు. అందుకు అవసరమైన హమాలీలను నియమించుకోవాలని కలెక్టర్ రైస్ మిల్లర్లకు […]

Update: 2020-04-29 09:35 GMT

దిశ, మెదక్: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి జిల్లాలోని రైస్ మిల్లర్ల యజమానులతో బుధవారం సమావేశం అయ్యారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్‌పై ఆయన చర్చించారు. 333 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి 44 రైస్ మిల్లులకు ధాన్యం చేరవేసేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు చేరగానే 12 గంటలలోపు లారీల నుంచి అన్ లోడింగ్ చేయాలన్నారు. అందుకు అవసరమైన హమాలీలను నియమించుకోవాలని కలెక్టర్ రైస్ మిల్లర్లకు సూచించారు.

Tags: Collector Venkatrama Reddy, review, Rice Millers, siddipet

Tags:    

Similar News