ఉద్రిక్తంగా మారిన కలెక్టరేట్ ముట్టడి.. రచ్చ.. రచ్చే

దిశ, నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని మనస్తాపం చెంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేవైఎం నేతలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపడుతున్న క్రమంలో పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు తీవ్ర వాగ్వివాదం తోపులాట చోటు చేసుకొని రచ్చరచ్చగా మారింది. ఇందులో విజయ్ […]

Update: 2021-07-13 04:34 GMT

దిశ, నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని మనస్తాపం చెంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేవైఎం నేతలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపడుతున్న క్రమంలో పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు తీవ్ర వాగ్వివాదం తోపులాట చోటు చేసుకొని రచ్చరచ్చగా మారింది.

ఇందులో విజయ్ కుమార్ అనే బీజేవైఎం కార్యకర్త విజయ్ భాస్కర్ దుస్తులు చిరిగాయి. మరికొంత మందిని బలవంతంగా లాక్కెళ్లి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న క్రమంలో ప్రజలకు జవాబుదారీగా ఉన్న అధికారులు వినతిపత్రాన్ని కూడా తీసుకోవడంలో స్పందించకపోవడం దారుణమని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భారత్ చంద్ర మండిపడ్డారు. దీనికి నిరసనగా కొద్దిసేపు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

Tags:    

Similar News