వాగులు దాటుకుంటూ.. సరిహద్దుల్లో పర్యటించిన కలెక్టర్
దిశ, కాటారం: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఇదే ప్రాంతంలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నా ఆ కలెక్టర్ మాత్రం మారుమూల పల్లెల్లో టూర్ చేశారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం శుక్రవారం పల్మెల మండలంలో పర్యటించారు. ఈ ప్రాంతాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న గోదావరి నది అవతలి వైపున ఉన్న చత్తీస్‌ఘడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నా కలెక్టర్ మాత్రం టూర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. […]
దిశ, కాటారం: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఇదే ప్రాంతంలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నా ఆ కలెక్టర్ మాత్రం మారుమూల పల్లెల్లో టూర్ చేశారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం శుక్రవారం పల్మెల మండలంలో పర్యటించారు. ఈ ప్రాంతాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న గోదావరి నది అవతలి వైపున ఉన్న చత్తీస్‌ఘడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నా కలెక్టర్ మాత్రం టూర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని మోదేడ్ గ్రామానికి రహదారి లేకుండా పోయిందని తెలియడంతో ఆయనే స్వయంగా ఆ ప్రాంతాన్ని నడుచుకుంటూ వెళ్లి సందర్శించారు. ఈ దారిలో వాగులో నీటి ప్రవాహం ఉన్నప్పటికీ ఆయన నడుచుకుంటూ దాటి, కుగ్రామానికి బైక్‌పై వెళ్లారు. వాగుపై వంతె నిర్మాణానికి ఎదురైన అడ్డంకులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ స్పెషల్ ఫండ్ కేటాయిస్తానని 20 రోజుల్లో ఈ వాగుపై రాకపోకలు ప్రారంభం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. అంతకు ముందు పల్మెల గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ గ్రామంలో నిరంతర నీటి ప్రవాహానికి కారణమైన వాగు వద్ద కూడా నిర్మాణాలు చేపట్టాలని ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. మూడు రోజుల్లో ఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తనకు పంపించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.