పాలమూరు-రంగారెడ్డి పరుగులు పెట్టాలి
దిశ, నాగర్‌కర్నూల్: జిల్లాలో కొనసాగుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగకుండా వేగవంతంగా భూసేకరణ పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఎల్.శర్మన్ ఆదేశించారు. గురువారం కలెక్టర్‌లో పాలమూరు- రంగారెడ్డి నీటిపారుదల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నాగర్‌కర్నూలు జిల్లాలో 13 ప్యాకేజీల్లో కొనసాగుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై జిల్లా కలెక్టర్‌కు నీటిపారుదల శాఖ అధికారి విజయ భాస్కర్ రెడ్డి వివరించారు. కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ… పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు సంబంధించి […]
దిశ, నాగర్‌కర్నూల్: జిల్లాలో కొనసాగుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగకుండా వేగవంతంగా భూసేకరణ పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఎల్.శర్మన్ ఆదేశించారు. గురువారం కలెక్టర్‌లో పాలమూరు- రంగారెడ్డి నీటిపారుదల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నాగర్‌కర్నూలు జిల్లాలో 13 ప్యాకేజీల్లో కొనసాగుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై జిల్లా కలెక్టర్‌కు నీటిపారుదల శాఖ అధికారి విజయ భాస్కర్ రెడ్డి వివరించారు.
కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ… పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు సంబంధించి కుడికిళ్ల, తీగలపల్లి, జొన్నల బొగుడ, కల్వకోల్, కుమ్మెర, పోతిరెడ్డిపల్లి, బొందలపల్లి, వట్టెం, తదితర గ్రామాల్లో కావలసిన భూసేకరణ రికార్డులను పరిశీలించారు. ఈ మావేశంలో అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు విజయ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.