పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్

దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో సోమవారం కలెక్టర్ ఎ. శరత్ పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మురుగు కాలువలు, మంచి నీటి ట్యాంకులు శుభ్రంగా ఉంచుకోవాలని, పైప్‌లైన్ లీకేజీలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని మూడెకరాల ఖాళీ స్థలంలో 18 రకాల పండ్ల మొక్కలను నాటాలన్నారు. అటు కామారెడ్డి పట్టణంలో పర్యటించిన […]

Update: 2020-06-01 03:37 GMT

దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో సోమవారం కలెక్టర్ ఎ. శరత్ పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మురుగు కాలువలు, మంచి నీటి ట్యాంకులు శుభ్రంగా ఉంచుకోవాలని, పైప్‌లైన్ లీకేజీలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని మూడెకరాల ఖాళీ స్థలంలో 18 రకాల పండ్ల మొక్కలను నాటాలన్నారు. అటు కామారెడ్డి పట్టణంలో పర్యటించిన కలెక్టర్ 15,16,17 వార్డుల్లో మురుగు కాలువలను పరిశీలించారు. రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు, చెత్త చెదారం లేకుండా చూడాలని, విధులు సక్రమంగా నిర్వహించని వారిని తొలగించాలని కమిషనర్ దేవేందర్‌ను ఆదేశించారు.

Tags:    

Similar News