ఉపాధి హామీ లక్ష్యాన్ని అధిగమించాలి: కలెక్టర్ వీపీ గౌతమ్
దిశ, వరంగల్: ఉపాధి హామీ పనులు వేగవంతంగా చేపట్టాలని అధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఉపాధి హామీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో జాబ్‌కార్డులు పొందిన వారందరికీ పనులు కల్పించాలన్నారు. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలని, అది పనిచేస్తుందో లేదో కూడా పరిశీలించుకోవాలన్నారు. కురవి, డోర్నకల్, బయ్యారం మండలాల్లో కూలీలు పెద్ద ఎత్తున […]
దిశ, వరంగల్: ఉపాధి హామీ పనులు వేగవంతంగా చేపట్టాలని అధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఉపాధి హామీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో జాబ్‌కార్డులు పొందిన వారందరికీ పనులు కల్పించాలన్నారు. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలని, అది పనిచేస్తుందో లేదో కూడా పరిశీలించుకోవాలన్నారు. కురవి, డోర్నకల్, బయ్యారం మండలాల్లో కూలీలు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులకు హాజరైనట్టుగా మిగతా మండలాల వారూ పనులకు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. వలస కూలీలను తమ స్వస్థలాలకు పంపించేందుకు బస్సులు ఏర్పాటు చేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సన్యాసయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యా చందన, డీపీవో నళిని నారాయణ తదితరులు పాల్గొన్నారు.
tags: labour work, targets must achieve, district collector vp gautham, video conference review