అధిక రేట్లకు విక్రయిస్తే చర్యలు : కలెక్టర్

దిశ, వరంగల్: నిత్యావసర వస్తువులు, కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు. శనివారం పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ను కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి కలసి ఆకస్మికంగా సందర్శించారు. కూరగాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఏ ఏం కూరగాయలు అమ్ముతున్నారు? అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయిస్తున్నట్టు కూరగాయల వ్యాపారులు వివరించారు. రద్దీ లేకుండా చూడాలని కొనుగోలుకు ఒక్కొక్కరే […]

Update: 2020-03-28 00:26 GMT

దిశ, వరంగల్:
నిత్యావసర వస్తువులు, కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు. శనివారం పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ను కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి కలసి ఆకస్మికంగా సందర్శించారు. కూరగాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఏ ఏం కూరగాయలు అమ్ముతున్నారు? అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయిస్తున్నట్టు కూరగాయల వ్యాపారులు వివరించారు. రద్దీ లేకుండా చూడాలని కొనుగోలుకు ఒక్కొక్కరే రావాలని సూచించారు. సామాజిక దూరం పాటిస్తూ, భద్రత పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. మాస్క్ లేని వారు ముక్కుకు అడ్డం దస్తీ కట్టుకోవాలని తెలిపారు. అనంతరం 23,24 వార్డుల్లో ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లను కలెక్టర్ పరిశీలించారు. కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసిన బండ్ల జీవన్‌తో కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్ ఇండ్ల ముందు ఏర్పాటు చేస్తే అందరికీ తెలియదని వార్డు సెంటర్లలో ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా కూరగాయలు విక్రయిస్తున్నట్టు వార్డులో విస్తృత ప్రచారం చేయించాలన్నారు. అలాగే వీధుల్లో యాచకులు, రోడ్లపై తిరుగుతున్న వారికి షెల్టర్ కల్పించి భోజన వసతి ఏర్పాటు చేయాలని మున్సిపల్ కౌన్సిలర్ మార్నేని వెంకన్నకు కలెక్టర్ సూచించారు.

Tags: Collector gautam, visit, vegetable market, warangal,Municipal Chairman

Tags:    

Similar News