కరోనా వచ్చినా తగ్గేదేలే.. చదువు ఆపేదేలే

దిశ, వెబ్ డెస్క్: అనుకున్నది సాధించాలనే తపన, పట్టుదల, కృషి వెరసి ఒకే మనిషిని సక్సెస్ ఫుల్ గా నిలబెడతాయి. ఆ సక్సెస్ అందే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నింటిని అధిగమించినప్పుడే విజయం చేతికి చిక్కుతుంది. అదే విజయం ఫార్ములా అని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ కులంగే తెలిపారు. తాజాగా ఆయన బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డు ను సందర్శించారు. అక్కడ ఒక సంఘటన తన మనసును హత్తుకుందని […]

Update: 2021-04-28 03:17 GMT

దిశ, వెబ్ డెస్క్: అనుకున్నది సాధించాలనే తపన, పట్టుదల, కృషి వెరసి ఒకే మనిషిని సక్సెస్ ఫుల్ గా నిలబెడతాయి. ఆ సక్సెస్ అందే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నింటిని అధిగమించినప్పుడే విజయం చేతికి చిక్కుతుంది. అదే విజయం ఫార్ములా అని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ కులంగే తెలిపారు. తాజాగా ఆయన బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డు ను సందర్శించారు. అక్కడ ఒక సంఘటన తన మనసును హత్తుకుందని ఆయన తెలిపారు.

ఒక యువకుడు సిఏ పరీక్షలకు సిద్దమవుతున్నాడు. ఇంతలో అతనికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. వెంటనే యువకుడిని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అయితే ఆ యువకుడు కరోనా వస్తే మాత్రం చదువు ఆపేయాలా? అంటూ ఆసుపత్రిలోనే చదువుకోవడం మొదలుపెట్టాడు. ఒకపక్క చికిత్స తీసుకుంటూనే పరీక్షలకు సంసిద్ధం అవుతున్నాడు. ఈ దృశ్యం గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ కులంగే కంటపడింది. ఆ యువకుడి వద్దకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. చుట్టూ ఉన్న పుస్తకాలు, క్యాలికులేటర్ చూసి కలెక్టర్ ఆశ్చర్యపోయాడు. వెంటనే అతని ఫోటో తీసి తన ట్విట్టర్ వేదికగా అందరితో షేర్ చేసుకున్నారు.

“మీ అంకితభావం మీ బాధను మరచిపోయేలా చేస్తుంది. ఆ తరువాత విజయం ఫార్మాలిటీ మాత్రమే” అంటూ పోస్ట్ చేశారు. ఇకపోతే షెడ్యూల్ ప్రకారం మే 21న ఈ పరీక్షలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో ఆ యువకుడిని బెడ్ వెకేట్ చేసి అవసరమున్న పేషేంట్స్ కి ఇవ్వాల్సిందిగా నెటిజన్లు కోరుతున్నారు.

Tags:    

Similar News