కరోనా నివారణ ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా..

దిశ, మేడ్చల్: కరోనా మహమ్మారి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసేందుకు కుత్బుల్లాపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పర్యటించారు. మండలంలోని రోడ మేస్త్రీనగర్, చంద్రగిరి నగర్‌ తదితర కాలనీల్లో పర్యటించి అక్కడి పరిస్థితులపై ఆశా వర్కర్లతో చర్చించారు. కరోనా నివారణ కోసం ఇంటింటి వెళుతున్న సిబ్బందికి ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంటైన్‌మెంట్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలిస్తూ అవసరమున్న ప్రతిచోట బారికేడ్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. ఈ […]

Update: 2020-04-11 02:49 GMT

దిశ, మేడ్చల్: కరోనా మహమ్మారి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసేందుకు కుత్బుల్లాపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పర్యటించారు. మండలంలోని రోడ మేస్త్రీనగర్, చంద్రగిరి నగర్‌ తదితర కాలనీల్లో పర్యటించి అక్కడి పరిస్థితులపై ఆశా వర్కర్లతో చర్చించారు. కరోనా నివారణ కోసం ఇంటింటి వెళుతున్న సిబ్బందికి ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంటైన్‌మెంట్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలిస్తూ అవసరమున్న ప్రతిచోట బారికేడ్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. ఈ సందర్బంగా బాలానగర్ డీసీపీ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ..ప్రతిరోజు సాయంత్రం పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, వైద్యాధికారులు సమావేశమై కరోనా వైరస్ నియంత్రణపై చర్చించుకోవాలని ఆదేశించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో చుట్టు పక్కల కుటుంబాలు ధైర్యంగా ఉండేలా ఉర్దూ, తెలుగులో ప్రచారం చేసి అవగాహన కల్పించాలన్నారు.సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, డీసీపీ పద్మజారెడ్డి, ఆర్డీఓ మల్లయ్య, కుత్బుల్లాపూర్ తహశీల్దార్ గౌరీవత్సల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags: corona, lockdown, medchal collector venkateswarlu, visit quthbullapur

Tags:    

Similar News