జలదిగ్బంధంలో 1500 కాలనీలు..
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలు, రహదారులు చెరువులను తలిపిస్తున్నాయి. జంట నగరాల్లో 1500 కాలనీలు మొత్తం జలదిగ్బంధం అయ్యాయి. పలుచోట్ల నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనాలు కొట్టుకుపోయాయి. రామంతాపూర్ చెరువు నిండుకుండను తలపిస్తోండగా.. చుట్టుపక్కల కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి. రవీంద్రనగర్, మహేశ్వరీ నగర్ కాలనీల్లో నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీర్జాదీగూడలోని ప్రగతినగర్ నీట మునగగా, చెంగిచెర్ల దగ్గర రహదారి తెగింది. దీంతో అక్కడ నీరు ఉధృతంగా […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలు, రహదారులు చెరువులను తలిపిస్తున్నాయి. జంట నగరాల్లో 1500 కాలనీలు మొత్తం జలదిగ్బంధం అయ్యాయి. పలుచోట్ల నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనాలు కొట్టుకుపోయాయి. రామంతాపూర్ చెరువు నిండుకుండను తలపిస్తోండగా.. చుట్టుపక్కల కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి.
రవీంద్రనగర్, మహేశ్వరీ నగర్ కాలనీల్లో నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీర్జాదీగూడలోని ప్రగతినగర్ నీట మునగగా, చెంగిచెర్ల దగ్గర రహదారి తెగింది. దీంతో అక్కడ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.ఇంద్రానగర్ కాలనీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకోగా.. ముంపు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి సమీక్షిస్తున్నారు.