అల్వాల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

దిశ, హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలోని అల్వాల్ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ క్లస్టర్‌గా గుర్తించినందున మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ పద్మజా రెడ్డి, జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత, మల్కాజిగిరి ఆర్డీవో మల్లయ్య, అల్వాల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య కలెక్టర్‌కు స్థానిక పరిస్థితులను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అల్వాల్ ఏరియాలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున కంటైన్‌మెంట్ జోన్‌గా […]

Update: 2020-04-16 09:11 GMT

దిశ, హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలోని అల్వాల్ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ క్లస్టర్‌గా గుర్తించినందున మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ పద్మజా రెడ్డి, జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత, మల్కాజిగిరి ఆర్డీవో మల్లయ్య, అల్వాల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య కలెక్టర్‌కు స్థానిక పరిస్థితులను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అల్వాల్ ఏరియాలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున కంటైన్‌మెంట్ జోన్‌గా గుర్తించినట్టు తెలిపారు. ఇక్కడి ప్రజలెవరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ పరిధిలోని ప్రజలకు మందులు, నిత్యావసర సరుకులు వారి ఇళ్ళకే పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిరంతరం వైద్య సిబ్బంది, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, హైడ్రోక్లోరిన్, బ్లీచింగ్ పౌడర్‌ను చల్లాలన్నారు.

Tags : corona virus, alwal containment, medchal, collector, tipparthi yadaiah

Tags:    

Similar News