లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలి : కలెక్టర్ శరత్

దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ శరత్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని కొత్త బస్టాండ్, సిరిసిల్ల, గంజి, జేపీఎస్ రోడ్డుల్లో ఆయనతోపాటు సంబంధిత అధికారులు పర్యటించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం 2 గంటల వరకే అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలని ఆదేశించారు. వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత దుకాణదారులదే అని తేల్చి చెప్పారు. అనంతరం ఆంధ్రా […]

Update: 2020-04-21 06:23 GMT

దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ శరత్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని కొత్త బస్టాండ్, సిరిసిల్ల, గంజి, జేపీఎస్ రోడ్డుల్లో ఆయనతోపాటు సంబంధిత అధికారులు పర్యటించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం 2 గంటల వరకే అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలని ఆదేశించారు. వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత దుకాణదారులదే అని తేల్చి చెప్పారు. అనంతరం ఆంధ్రా బ్యాంకు అధికారులతో సమావేశమైన ఆయన ఖాతాదారులు సామాజిక దూరం పాటించేలా చూడాలన్నారు. ఎస్పీ శ్వేత మాట్లాడుతూ సరైన కారణం లేకుండా ప్రజలు బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. కుటుంబానికి ఒక్కరే బయటకు వచ్చి నిత్యావసరాలు, మెడికల్ వస్తువులు తీసుకుని వెళ్ళాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్ర కుమార్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ శైలజ, తహసీల్దార్ అమీన్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: kamareddy, corona, lockdown, collector sharath kumar, visit local areas

Tags:    

Similar News