సర్పంచ్‌పై ఫిర్యాదు.. విచారణకు కలెక్టర్ ఆదేశాలు
దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా నవీపేట్ సర్పంచ్ శ్రీనివాస్ అండదండలతో.. గ్రామ పంచాయతీ ఆవరణలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా నవీపేట్ రెండో వార్డు సభ్యురాలు మేకల శోభ, తన భర్త మాజీ వార్డు మెంబర్ మేకల అశోక్‌తో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ పాత భవనం వెనుకల, పశువధ శాల నుంచి మూడు మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవుతో […]
దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా నవీపేట్ సర్పంచ్ శ్రీనివాస్ అండదండలతో.. గ్రామ పంచాయతీ ఆవరణలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా నవీపేట్ రెండో వార్డు సభ్యురాలు మేకల శోభ, తన భర్త మాజీ వార్డు మెంబర్ మేకల అశోక్‌తో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ పాత భవనం వెనుకల, పశువధ శాల నుంచి మూడు మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవుతో అక్రమ కట్టాడాలు కడుతున్నారని ఆరోపించారు. సర్పంచ్ అండతో గ్రామ పంచాయతీ స్థలాన్ని కబ్జా చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొని.. పంచాయతీ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి.. జిల్లా పంచాయతీ అధికారి ద్వారా విచారణకు అదేశించారు.