లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి -ఎంవీ రెడ్డి

దిశ, ఖ‌మ్మం: కరోనా వైర‌స్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నెలాఖ‌రు వరకు పొడిగించినందున ప్రజలందరూ సహకరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. వ్యాధి నియంత్రణకు లాక్‌డాన్ పాటించడం తప్ప వేరే మార్గం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో విధించిన లాక్‌డౌన్‌కు జిల్లా ప్రజలు తమ సంపూర్ణ సహకారాన్ని అందించారని.. ఇదే స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని కోరారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని […]

Update: 2020-04-12 09:00 GMT

దిశ, ఖ‌మ్మం: కరోనా వైర‌స్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నెలాఖ‌రు వరకు పొడిగించినందున ప్రజలందరూ సహకరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. వ్యాధి నియంత్రణకు లాక్‌డాన్ పాటించడం తప్ప వేరే మార్గం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో విధించిన లాక్‌డౌన్‌కు జిల్లా ప్రజలు తమ సంపూర్ణ సహకారాన్ని అందించారని.. ఇదే స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని కోరారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను అదేశించారు. నిత్యావ‌స‌ర‌ వస్తువుల రవాణాకు సంబంధించి అనుమతి కొరకు అదనపు కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారులను సంప్రదించాలని వ్యాపారులకు సూచించారు.

tag: Collector MV reddy, References, lockdown, Bhadradri Kothagudem

Tags:    

Similar News