జయసుధ మరణం తీరనిలోటు : కలెక్టర్
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో జూనియర్ స్టెనోగ్రాఫర్‌గా విధులు నిర్వహిస్తున ములకలపల్లి జయసుధ(35) కరోనాతో మరణించడం బాధాకరం అని కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జయసుధ సంతాప సభ నిర్వహించి, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్బంగా మాట్లాడుతూ… జయసుధ చాలా తెలివిగల మహిళ అని, విషయ పరిజ్ఞానంతో చెప్పిన విధులను పెండింగ్ లేకుండా చేసేవారని అన్నారు. అలాంటి జయసుధ కరోనాతో అకాల […]
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో జూనియర్ స్టెనోగ్రాఫర్‌గా విధులు నిర్వహిస్తున ములకలపల్లి జయసుధ(35) కరోనాతో మరణించడం బాధాకరం అని కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జయసుధ సంతాప సభ నిర్వహించి, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్బంగా మాట్లాడుతూ… జయసుధ చాలా తెలివిగల మహిళ అని, విషయ పరిజ్ఞానంతో చెప్పిన విధులను పెండింగ్ లేకుండా చేసేవారని అన్నారు.
అలాంటి జయసుధ కరోనాతో అకాల మరణం చెందడం భాదాకరని ఆవేదన వ్యక్తం చేశారు. కండక్టర్ ఉద్యోగం కూడా సాధించి, కొంతకాలం పనిచేసి అందరి మన్ననలు పొందారని వెల్లడించారు. జయసుధ త్యాగాన్ని స్పూర్తిగా తీసుకుని, ఇతర ఉద్యోగులు ప్రజలకు సేవలందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జయసుధ భర్త నరేష్ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారని, ఆమెకు 7 సంవత్సరాల కూతురు ఉందని అన్నారు. జయసుధ కూతురు, కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ప్రభుత్వ పరంగా ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.