పారిశుధ్య నిర్వహణ బాగుపడాలి..

దిశ, పటాన్‌చెరు: వైకుంఠ ధామాలు, రైతు వేదికల నిర్మాణాలు వేగవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. సోమవారం పటాన్‌చెరు మండలంలోని భానూర్, నందిగామ, కర్థనూర్ గ్రామాలను కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి వైకుంఠ ధామాలు, రైతు వేదికల పనుల పురోగతిని పరిశీలించారు. పనులలో వేగం పెంచాలన్నారు. పనులు నాణ్యతగా ఉండాలని సూచించారు. గ్రామ పారిశుధ్య నిర్వహణ బాగుపడాలని అన్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ సరిగ్గా చేయాలని ఆయన సూచించారు. నిర్లక్ష్య […]

Update: 2020-07-27 10:08 GMT

దిశ, పటాన్‌చెరు: వైకుంఠ ధామాలు, రైతు వేదికల నిర్మాణాలు వేగవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. సోమవారం పటాన్‌చెరు మండలంలోని భానూర్, నందిగామ, కర్థనూర్ గ్రామాలను కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి వైకుంఠ ధామాలు, రైతు వేదికల పనుల పురోగతిని పరిశీలించారు. పనులలో వేగం పెంచాలన్నారు. పనులు నాణ్యతగా ఉండాలని సూచించారు. గ్రామ పారిశుధ్య నిర్వహణ బాగుపడాలని అన్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ సరిగ్గా చేయాలని ఆయన సూచించారు. నిర్లక్ష్య ధోరణి విడనాడకుంటే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. కర్థనూర్ గ్రామంలో మొక్కలను పరిశీలించి, నాటిన మొక్కల్లో ప్రతి ఒక మొక్కనూ రక్షించాలని సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శికి ఆదేశించారు.

Tags:    

Similar News