సమస్యలు వేగ వంతంగా పరిష్కరించాలి

దిశ, భువనగిరి: ప్రజావాణి ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వేగవంతంగా పరిష్కరించాలని యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేగట్‌లో ప్రజావాణిలో భాగంగా ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 30 ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వెంటనే పరిష్కరించి, అర్హులకు న్యాయం చేయాలని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా భువనగిరి మండలం సూరేపల్లిలో వర్షాలకు దెబ్బతిన్న చెరువు కట్టను ఆమె పరిశీలించి, తక్షణమే మరమ్మతులు చేయాలని, సంబంధిత ఇరిగేషన్ ఏఈ బాలకృష్ణకు […]

Update: 2020-08-17 05:13 GMT

దిశ, భువనగిరి: ప్రజావాణి ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వేగవంతంగా పరిష్కరించాలని యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేగట్‌లో ప్రజావాణిలో భాగంగా ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 30 ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వెంటనే పరిష్కరించి, అర్హులకు న్యాయం చేయాలని ఆమె ఆదేశించారు.

ఈ సందర్భంగా భువనగిరి మండలం సూరేపల్లిలో వర్షాలకు దెబ్బతిన్న చెరువు కట్టను ఆమె పరిశీలించి, తక్షణమే మరమ్మతులు చేయాలని, సంబంధిత ఇరిగేషన్ ఏఈ బాలకృష్ణకు ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే స్వీకరించాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News