అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ములుగు కలెక్టర్
దిశ, ములుగు: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా వరదనీరు చేరి, చెరువులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ములుగు జిల్లా లోతట్టు ప్రాంతాల ప్రజలను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అప్రమత్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణ శాఖ జారీ చేసిన సూచనలు మేరకు రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను ఎప్పటికప్పడు […]
దిశ, ములుగు: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా వరదనీరు చేరి, చెరువులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ములుగు జిల్లా లోతట్టు ప్రాంతాల ప్రజలను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అప్రమత్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణ శాఖ జారీ చేసిన సూచనలు మేరకు రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను ఎప్పటికప్పడు మానిటరింగ్ చేయాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అలాగే పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతం ములుగు జిల్లాలో ఎక్కువగా ఉన్నందున జిల్లా యంత్రాంగం గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 0520 ప్రజలకు అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.