కలెక్టర్ సీరియస్.. 8 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు
దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : విధుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన 8 మంది అధికారులు, సిబ్బందికి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 100శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కానందుకు గాను హార్టికల్చర్ ఏడీ, నెడ్‌క్యాప్ అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. కోయిలకొండ మండలంలో వంద మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించవలసి ఉండగా, కేవలం తొమ్మిది మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడం […]
దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : విధుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన 8 మంది అధికారులు, సిబ్బందికి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 100శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కానందుకు గాను హార్టికల్చర్ ఏడీ, నెడ్‌క్యాప్ అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీచేశారు.
కోయిలకొండ మండలంలో వంద మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించవలసి ఉండగా, కేవలం తొమ్మిది మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ మండల ఎంపీడీఓ, తహశీల్దార్, ఎంపీఓ, ఎంపీహెచ్‌ఓ, ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ వెంకట్రావు హెచ్చరించారు.