నిబంధనలు పాటించని మిల్లర్లపై చర్యలు: కలెక్టర్ రాజీవ్ హనుమంతు
దిశ, వరంగల్: ప్రభుత్వ నిబంధనలు పాటించని రైస్ మిల్లర్లపై చర్యలు తప్పవని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. శనివారం హసన్‌పర్తి మండలం జయగిరి, మడిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రోజువారీగా మిల్లులకు తరలించాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు ముందు జాగ్రత్తలు […]
దిశ, వరంగల్: ప్రభుత్వ నిబంధనలు పాటించని రైస్ మిల్లర్లపై చర్యలు తప్పవని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. శనివారం హసన్‌పర్తి మండలం జయగిరి, మడిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రోజువారీగా మిల్లులకు తరలించాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి కోతలు ఎప్పటి వరకు పూర్తవుతాయని రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ బావి కింద కోతలు అయిపోయాయని, కాల్వల కింద వేసిన పంటలకు ఇంకా నెల రోజుల సమయం పడుతుందని రైతులు వివరించారు.
ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించాలంటే ఓపీఎంఎస్‌లో జాప్యం లేకుండా రికార్డు చేయాలని జిల్లా పాలనాధాకారి అధికారులను ఆదేశించారు. నిబంధనల మేరకు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్యం సిద్ధంగా ఉందని, వారికి చెల్లించడానికి నిధుల కొరత కూడా లేదన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తోందని కలెక్టర్ రైతులకు స్ఫష్టం చేశారు.
Tags : lockdown, rules break, urban collecter rajeev hanumanthu, serious action, orders passed