భయపడకండి.. మీకు అండగా మేమున్నాం : కలెక్టర్ రాజార్షి షా

దిశ, పటాన్‌చెరు: కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయినికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎలాంటి భయాలు, ఆందోళనకు గురి కావొద్దని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజార్షి షా భరోసానిచ్చారు. మంగళవారం ఆయన పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించారు. గురుకులం మొత్తం కలియతిరిగారు. తరగతి గదిలో విద్యార్థులకు బోధిస్తున్న తీరు, భౌతిక దూరం, మాస్కులు ధరించడం తదితర వాటిని పరిశీలించారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో […]

Update: 2021-11-30 11:45 GMT

దిశ, పటాన్‌చెరు: కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయినికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎలాంటి భయాలు, ఆందోళనకు గురి కావొద్దని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజార్షి షా భరోసానిచ్చారు. మంగళవారం ఆయన పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించారు. గురుకులం మొత్తం కలియతిరిగారు. తరగతి గదిలో విద్యార్థులకు బోధిస్తున్న తీరు, భౌతిక దూరం, మాస్కులు ధరించడం తదితర వాటిని పరిశీలించారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపల్ అధికారులతో సమావేశం అయ్యారు. విద్యార్థుల విషయంలో అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న అనారోగ్యం తలెత్తిన ఆలస్యం చేయరాదని ఉపాధ్యాయులకు సూచించారు. ఏదేని ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే ఆసుపత్రికి షిఫ్ట్ చేయాలన్నారు. గురుకులంలోని అన్ని తరగతి గదులు, పరిసరాలు సోడియం హైపో క్లోరైడ్ పిచికారి చేయించామని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు.

కొవిడ్ బారిన పడిన విద్యార్థులు, ఉపాధ్యాయురాలు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. గురుకులంలో డాక్టర్లు ఏఎన్ఎంతో కూడిన వైద్య బృందం, రెవెన్యూ, పంచాయతీరాజ్ బృందాలు అక్కడే ఉండి 24 గంటలు పనిచేస్తున్నట్లు రాజర్షి షా తెలిపారు. అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు. అనంతరం కొవిడ్ బారిన పడిన పిల్లల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయురాలికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, డాక్టర్లు సూచించిన మేరకు మందులు వాడాలని, ఇంట్లోనూ మిగతా వారితో కలవకుండా ప్రత్యేక గదిలో ఉండాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. మిగతా కుటుంబ సభ్యులు టెస్టులు చేయించుకోవాలన్నారు.

ఉపాధ్యాయురాలిని, పిల్లల తల్లిదండ్రులను టీకా వేసుకున్నారా..?. రెండు డోసులు తీసుకున్నారా? అంటూ ఆరా తీశారు. టీకా తీసుకున్నామని వారు తెలపడంతో, తొందరగా రికవరీ అవుతుందని, భయపడవద్దని వారికి ధైర్యం చెప్పారు. ఏ అవసరం ఉన్న డీఎంఅండ్ హెచ్ఓ, తనను ఫోన్‌లో సంప్రదించవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ గాయత్రీ దేవి, తహశీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎంపీడీఓ బన్సీలాల్, ఎంపీఓ రాజు, ఆర్ఐ రంగయ్య పాల్గొన్నారు.

Tags:    

Similar News