వచ్చే 10 రోజులు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్ ఎంవీరెడ్డి
దిశ, ఖమ్మం: రానున్న 10 రోజుల్లో పెద్ద ఎత్తున ధాన్యం తరలి వచ్చే అవకాశం ఉందని, కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి మండలానికి జిల్లా అధికారులను ప్రత్యేకంగా నియమించినట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రాల వారీగా వ్యవసాయ, పీఏసీఎస్ చైర్మన్లు రైతులకు అవగాహన కల్పించడంతోపాటు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం, మొక్కజొన్నలు తడవకుండా గన్నీ సంచుల్లో నింపి […]
దిశ, ఖమ్మం: రానున్న 10 రోజుల్లో పెద్ద ఎత్తున ధాన్యం తరలి వచ్చే అవకాశం ఉందని, కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి మండలానికి జిల్లా అధికారులను ప్రత్యేకంగా నియమించినట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రాల వారీగా వ్యవసాయ, పీఏసీఎస్ చైర్మన్లు రైతులకు అవగాహన కల్పించడంతోపాటు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం, మొక్కజొన్నలు తడవకుండా గన్నీ సంచుల్లో నింపి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎవరైనా అలసత్వం వహిస్తున్నట్టు తేలితే వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు తగినన్ని వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాల్లో ధాన్యం నిల్వల పరిశీలన, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా స్టాక్ కేంద్రాల ఏర్పాటు, రవాణా తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు.
Tags : purchasing center, be alert, collecter mv reddy, 10days, formers