మూలవాగు బ్రిడ్జి ఘటనపై కలెక్టర్ సీరియస్.. షోకాజ్ నోటీసులు జారీ!
దిశ, సిరిసిల్ల : వేములవాడ పట్టణంలోని మూలవాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరోసారి కూలిపోయింది. కాగా, నిర్మాణ పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శించినందుకు గానూ జిల్లా రోడ్డు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎ.కిషన్ రావుకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామ శివారులో నిర్మించిన ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రహరీ గోడ వర్షానికి తడిసి కూలిపోయింది. ఈ కళాశాల ప్రహరీ […]
దిశ, సిరిసిల్ల : వేములవాడ పట్టణంలోని మూలవాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరోసారి కూలిపోయింది. కాగా, నిర్మాణ పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శించినందుకు గానూ జిల్లా రోడ్డు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎ.కిషన్ రావుకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామ శివారులో నిర్మించిన ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రహరీ గోడ వర్షానికి తడిసి కూలిపోయింది. ఈ కళాశాల ప్రహరీ నిర్మాణ పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శించినందుకు టీఎస్ఎమ్ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దేవేందర్ కుమార్‌కు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీచేశారు. ఒక రోజు గడువులో పూర్తి వివరణతో కూడిన సమాధానం ఇవ్వకపోతే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.