బండ్లగూడ, ఇబ్రహీంపట్నంలో కలెక్టర్ తనిఖీలు
దిశ, రంగారెడ్డి: కరోనా వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు శనివారం ఉదయం కలెక్టర్ అమోయ్ కుమార్ బండ్లగూడ, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. క్వారంటైన్ సెంటర్‌లో ఉన్న వారికోసం చేపట్టిన ఏర్పాట్లు, పరిసరాల్లో శానిటేషన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై స్థానిక అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఇబ్రహీంపట్నంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. […]
దిశ, రంగారెడ్డి: కరోనా వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు శనివారం ఉదయం కలెక్టర్ అమోయ్ కుమార్ బండ్లగూడ, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. క్వారంటైన్ సెంటర్‌లో ఉన్న వారికోసం చేపట్టిన ఏర్పాట్లు, పరిసరాల్లో శానిటేషన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై స్థానిక అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఇబ్రహీంపట్నంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ పనులు, వలస కూలీలకు ఉచిత బియ్యం, నగదు పంపిణీ, లాక్‌డౌన్ నిబంధనల అమలు తదితర అంశాలపై ఆర్దీవోలు, తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.
Tags: carona, lockdown, collecter amoy kumar, visit bandlaguda, ibrahim patnam