మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

దిశ, వెబ్ డెస్క్: ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో మహద్ తాలుకా కేంద్రంలోని కాజల్ పురలో ఉన్న ఐదంతస్తుల భవనం సోమవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీస్తున్నారు. ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే, ఆ భవనంలో మొత్తం 45 ప్లాట్లు ఉన్నాయని, ప్రాణనష్టం భారీగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. […]

Update: 2020-08-25 00:42 GMT
మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో మహద్ తాలుకా కేంద్రంలోని కాజల్ పురలో ఉన్న ఐదంతస్తుల భవనం సోమవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీస్తున్నారు. ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే, ఆ భవనంలో మొత్తం 45 ప్లాట్లు ఉన్నాయని, ప్రాణనష్టం భారీగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags:    

Similar News