మోగిన గని హారన్..మాస్క్ ఉంటేనే మస్టర్

దిశ‌, ఖ‌మ్మం : కరోనా నేపథ్యంలో ఇన్నిరోజులు రాష్ట్రంలోని బొగ్గు బావులు మూసివేసి ఉన్నాయి. దాదాపు 50 రోజులుగా కార్మికులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.అయితే గురువారం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్రంలో సింగ‌రేణి బొగ్గు ఉత్ప‌త్తి ప‌నులు ఉద‌యం షిఫ్ట్‌తో ప్రారంభ‌మ‌య్యాయి.యాజమాన్యం పిలుపుమేరకు సింగ‌రేణి కార్మికులు ఉత్సాహంగా తిరిగి ప‌నుల్లోకి చేరారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల మేర‌కు సింగ‌రేణి సంస్థ ఏప్రిల్ 1న కొత్త‌గూడెంలోని 22 బొగ్గుబావుల‌కు లే ఆఫ్ ప్ర‌క‌టించింది.రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సడలించడంతో తెల్లవారుజాము నుంచే […]

Update: 2020-05-21 10:07 GMT

దిశ‌, ఖ‌మ్మం :
కరోనా నేపథ్యంలో ఇన్నిరోజులు రాష్ట్రంలోని బొగ్గు బావులు మూసివేసి ఉన్నాయి. దాదాపు 50 రోజులుగా కార్మికులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.అయితే గురువారం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్రంలో సింగ‌రేణి బొగ్గు ఉత్ప‌త్తి ప‌నులు ఉద‌యం షిఫ్ట్‌తో ప్రారంభ‌మ‌య్యాయి.యాజమాన్యం పిలుపుమేరకు సింగ‌రేణి కార్మికులు ఉత్సాహంగా తిరిగి ప‌నుల్లోకి చేరారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల మేర‌కు సింగ‌రేణి సంస్థ ఏప్రిల్ 1న కొత్త‌గూడెంలోని 22 బొగ్గుబావుల‌కు లే ఆఫ్ ప్ర‌క‌టించింది.రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సడలించడంతో తెల్లవారుజాము నుంచే నల్ల సూర్యులు తమ పరికరాలు చేతపట్టుకుని మైన్స్‌లోకి దిగారు.తెలంగాణలో జీహెచ్‌ఎంసీ మినహా, మిగతా జిల్లాలు గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్స్‌లో ఉన్నప్పటికీ కార్మికులు త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ విధులు నిర్వర్తించేలా సంస్థ ఉద్యోగులు వారికి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. మాస్క్ ధ‌రిస్తేనే..మ‌స్ట‌ర్ న‌మోదు చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు సింగ‌రేణి డిప్యూటీ జ‌న‌ర‌ల్‌ మేనేజ‌ర్ శ్రీనాథ్ తెలిపారు. అలాగే విధుల‌కు హాజ‌రైన కార్మికుల‌కు శానిటైజ‌ర్ల‌ు కూడా అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

Tags:    

Similar News