కరోనాతో మరణిస్తే రూ. 15 లక్షలు
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ క్రమేణా విజృంభిస్తోంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు మరింత ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలు ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ.. ఉద్యోగులకు కరోనా బీమా కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోల్ ఇండియా ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. వైరస్ తో మరణించిన వారి కుటుంబాలకు భరోసానిచ్చేందుకు రూ. 15 లక్షల పరిహారం అందజేస్తామని స్పష్టం చేసింది. కోల్ […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ క్రమేణా విజృంభిస్తోంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు మరింత ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలు ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ.. ఉద్యోగులకు కరోనా బీమా కల్పించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కోల్ ఇండియా ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. వైరస్ తో మరణించిన వారి కుటుంబాలకు భరోసానిచ్చేందుకు రూ. 15 లక్షల పరిహారం అందజేస్తామని స్పష్టం చేసింది. కోల్ ఇండియాలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని.. తాము తీసుకున్న నిర్ణయం మార్చి 24 నుంచే అమల్లోకి వచ్చేలా చేస్తామని స్పష్టం చేసింది.