అమిత్ షాకు ఓకే.. మరి ఈ ఆల్ ఫ్రీ బాబులకు అంతసీనుందా?!
దిశ,వెబ్‌డెస్క్: త్వరలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయా పార్టీలకు చెందిన అధినేతలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. ఎన్నికల గెలుపు లక్ష్యంగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందులో తొలత విజయం సాధించింది బీజేపీయే అని చెప్పుకోవాలి. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అపర చాణక్యుడు అమిత్ షా సంక్షేమ పథకాలతో పాటు, కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నట్లు ప్రకటించారు.మేనిఫెస్టోలో పొందుపరిచాయి. దీంతో ఓటర్లు సైతం బీజేపీకి, […]
దిశ,వెబ్‌డెస్క్: త్వరలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయా పార్టీలకు చెందిన అధినేతలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. ఎన్నికల గెలుపు లక్ష్యంగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందులో తొలత విజయం సాధించింది బీజేపీయే అని చెప్పుకోవాలి. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అపర చాణక్యుడు అమిత్ షా సంక్షేమ పథకాలతో పాటు, కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నట్లు ప్రకటించారు.మేనిఫెస్టోలో పొందుపరిచాయి. దీంతో ఓటర్లు సైతం బీజేపీకి, దాని మిత్ర పక్ష పార్టీలకు మద్దతు పలకడంతో విజయం సునాయసమైంది.
ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గెలుపుకోసం బీజేపీ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. ఈయేడాది వెస్ట్ బెంగాల్ లో జరిగే 294 అసెంబ్లీ స్థానాలకు అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ తమ అభ్యర్ధులు బరిలోకి దిగనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు సీఎం మమతా బెనర్జీ ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న చందంగా.. బీజేపీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ అంటూ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఓట్లు రాబట్టిందో తాము కూడా అలాగే ఓట్లు దండుకొని సీఎం పీఠాన్ని అధీష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు. మనదేశంలో జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో దీదీ సైతం రాష్ట్రప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీ అంటూ ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో గెలుపు మనదే అంటూ దీదీ పార్టీ అనుచరులతో ఢంకా బజాయిస్తున్నారు.
బీజేపీని, టీఎంసీ కంటే తానేం తక్కువేం కాదని అనుకున్నారో ఏమో తమిళనాడు సీఎం పళని స్వామి రూటు మార్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని పళని స్వామి రాజకీయ చదరంగంలో వడివడిగా పావులు కదుపుతున్నారు. అందుకే కరోనా పేరు చెప్పి విద్యార్ధుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కరోనా కారణంగా విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. కాలేజీలు స్టార్ట్ అయినా విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసులకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తమిళనాడు విద్యార్థులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి శుభవార్త చెప్పారు. రోజూ 2జీబీ డేటా ఉచితంగా అందివ్వనున్నట్టు ప్రకటించారు. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ డేటా కార్డులను అందించనున్నట్లు చెప్పారు. పనిలోపనిగా ప్రభుత్వం ఇచ్చే డేటాను ఆన్ లైన్ పాఠాలు వినడానికి మాత్రమే వినియోగించుకోవాలని విద్యార్థులను సీఎం పళని కోరారు.
అయితే ఈ హామీలపై రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్లు ..ఉచిత హామీలు ప్రకటిస్తే..జనం ఓట్లేస్తారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో వెయిట్ వాచ్ నెక్ట్స్ రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతుందో.