సీఎం దీదీ బంపర్ ఆఫర్.. అలా చేసిన వారందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా
దిశ,వెబ్‌డెస్క్:పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. 294 స్థానాలున్న బెంగాల్లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే బీజేపీ, అధికార పార్టీ టీఎంసీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బెంగాల్ లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ.., కమల నాథుల దూకుడుకు కళ్లెం వేయాలని పట్టుదలతో ఉన్నారు. బెంగాల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇరు పార్టీల నేతలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో తమసర్వశక్తుల్ని ఒడ్డుతున్నారు. అయితే మార్చి 27 […]
దిశ,వెబ్‌డెస్క్:పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. 294 స్థానాలున్న బెంగాల్లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే బీజేపీ, అధికార పార్టీ టీఎంసీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బెంగాల్ లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ.., కమల నాథుల దూకుడుకు కళ్లెం వేయాలని పట్టుదలతో ఉన్నారు. బెంగాల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇరు పార్టీల నేతలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో తమసర్వశక్తుల్ని ఒడ్డుతున్నారు.
అయితే మార్చి 27 నుంచి ప్రారంభం కానున్న ఎన్నికల పోలింగ్ లో బీజేపీ చెక్ పెట్టాలని భావిస్తున్న పశ్చిమ బెంగాల్ ప్రజలకు సీఎం మమత బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎన్నికల్లో బీజేపీ నేతలు డబ్బులు పంచే సమయంలో వారిని పట్టిస్తే గవర్నమెంట్ జాబ్ ఇస్తానని ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఔత్సాహికులు బీజేపీ నేతలు ఎక్కడ డబ్బులు పంచుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.