‘కరోనా కంటే డేంజర్ సీఎం కేసీఆర్’

దిశ‌, న‌ర్సాపూర్‌ : తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం హత్నూర త‌హ‌సీల్దార్‌కు కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. అనంత‌రం దళిత గిరిజన దండోరా నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కోసమే దళిత బంధును అమల్లోకి తెచ్చారని ఆరోపించారు. ద‌ళిత బంధు ప‌థ‌కం కేవ‌లం హుజురాబాద్‌కే ప‌రిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. గత ఏడు […]

Update: 2021-09-06 08:14 GMT

దిశ‌, న‌ర్సాపూర్‌ : తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం హత్నూర త‌హ‌సీల్దార్‌కు కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. అనంత‌రం దళిత గిరిజన దండోరా నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కోసమే దళిత బంధును అమల్లోకి తెచ్చారని ఆరోపించారు. ద‌ళిత బంధు ప‌థ‌కం కేవ‌లం హుజురాబాద్‌కే ప‌రిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు.

గత ఏడు సంవత్సరాలుగా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే గాని ఈ ప్రాంతం అభివృద్ధి చెందే పరిస్థితిలో లేదని అన్నారు. ఉప ఎన్నిక వస్తే తప్ప అభివృద్ధి జరగదనే భావనలో ప్రజలున్నారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల అభిష్టం మేరకు మదన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

దళితులకు మూడెకరాల భూమి అందించాల్సింది పోయి, రూ.10 లక్షలు చెల్లిస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళితుల ప్రయోజనాల కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయ‌కులు సోమ‌న్నగారి ర‌వీంద‌ర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు హకీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్, శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు రియాజ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కిష్టయ్య, సర్పంచ్ లు కొన్యాల వెంకటేశం, సుజాత సత్యం, క్రిష్ణ త‌దిత‌రులు ఉన్నారు.

Tags:    

Similar News