మాటలు జాగ్రత్త.. టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ వార్నింగ్

దిశ, తెలంగాణ బ్యూరో : దళిత వర్గాల అంశంలో టీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు, నేతలకు కీలకమైన సూచనలు జారీ చేశారు. దళిత బంధుతో పాటు నిధుల వంటి అంశాల్లో ఆచితూచి మాట్లాడాలని, గతంలో ఆ వర్గాలపై పలువురు చేసిన అనుచిత వ్యాఖ్యలతో తలనొప్పి ఎదురైందంటూ ఈ సందర్భంగా హెచ్చరించారు. దళితుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులతో పాటుగా ఉన్నతాధికారులకు సీఎంవో కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు మంగళవారం రాత్రి జారీ చేశారు. దళిత బంధు అమలు అవుతున్న నేపథ్యంలో […]

Update: 2021-08-17 12:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దళిత వర్గాల అంశంలో టీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు, నేతలకు కీలకమైన సూచనలు జారీ చేశారు. దళిత బంధుతో పాటు నిధుల వంటి అంశాల్లో ఆచితూచి మాట్లాడాలని, గతంలో ఆ వర్గాలపై పలువురు చేసిన అనుచిత వ్యాఖ్యలతో తలనొప్పి ఎదురైందంటూ ఈ సందర్భంగా హెచ్చరించారు. దళితుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులతో పాటుగా ఉన్నతాధికారులకు సీఎంవో కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు మంగళవారం రాత్రి జారీ చేశారు. దళిత బంధు అమలు అవుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆచితూచి మాట్లాడాలని సూచించారు.

రెవెన్యూ, పోలీసులు అధికారులు దళితుల విషయంలో ఏదైనా సమస్య ఉంటే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. గతంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు పలువురు చేసిన వ్యాఖ్యాలను ఈ సందర్భంగా ఉదహరించారు. అలా నోరు జారితే తీవ్ర చర్యలు ఉంటాయని సైతం హెచ్చరికలు జారీ చేశారు. అదే విధంగా వివిధ సమస్యలు, ఇబ్బందుల దృష్ట్యా రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్లకు వస్తే సత్వరమే పరిష్కారం అయ్యేలా అధికార పార్టీ నేతలు చొరవ చూపాలని వివరించారు.

దళిత బంధు విషయంలో ఇతర వర్గాల నుంచి డిమాండ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఎక్కడ నోరు జారోద్దని ఆదేశించారు. ఆయా వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలను వివరించే ప్రయత్నం చేయాలని సూచించారు. దళిత బంధు అంశంలో విమర్శలు, నిలదీతలు ఎదురైతే సామరస్యంగా తప్పించుకునే ప్రయత్నాలు చేయాలని, కానీ బీసీ వర్గాలు, ఇతర వర్గాలపై అనుచితంగా మాట్లాడరాదంటూ సీఎం నుంచి చెప్పారంటూ సీఎంఓ అధికారులు మంగళవారం రాత్రి నుంచి ఫోన్లు చేసి చెప్పారు. పలు సందర్భాల్లో నోరుజారి సమస్యలు ఎదుర్కొన్న వారిని మరింత హెచ్చరించారు.

Tags:    

Similar News