కొండపోచమ్మ సాగర్‌కు బయల్దేరిన సీఎం కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు నిజాంసాగర్‌కు తరలిరానున్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ నేడు పర్యటించనున్నారు. మరి కాసేపట్లోనే కొండపోచమ్మకు చేరుకొని.. కొండపోచమ్మ జలాలను హల్ది వాగులోకి విడుదల చేయనున్నారు. ముందుగా ఉదయం 10.30 గంటలకు అవుసులోనిపల్లి గ్రామంలోని సంగారెడ్డి కెనాల్ నుంచి హల్ది వాగులోకి నీటిని విడుదల చేయనున్నారు. ఆ […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు నిజాంసాగర్‌కు తరలిరానున్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ నేడు పర్యటించనున్నారు. మరి కాసేపట్లోనే కొండపోచమ్మకు చేరుకొని.. కొండపోచమ్మ జలాలను హల్ది వాగులోకి విడుదల చేయనున్నారు. ముందుగా ఉదయం 10.30 గంటలకు అవుసులోనిపల్లి గ్రామంలోని సంగారెడ్డి కెనాల్ నుంచి హల్ది వాగులోకి నీటిని విడుదల చేయనున్నారు. ఆ తర్వాత నేరుగా మర్కూక్ వెళ్లి.. పాములపర్తిలో గోదావరి జలాలను గజ్వేల్ కాలువలోకి విడుదల చేస్తారు.. అనంతరం కొండపోచమ్మ సాగర్‌కు చేరుకొని.. ఇదే జలాశయం నుంచి హల్ది వాగు, మంజీరా మీదుగా నిజాంసాగర్‌లోకి గోదావరి జలాలను విడుదల చేయనున్నారు.