బిగ్ బ్రేకింగ్.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ సోమవారం హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ చేస్తున్న దళిత బంధు పథకానికి హుజురాబాద్​ ప్రాంతం ప్రయోగశాల అవుతుందని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. రాష్ట్రంలో 15 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా దళిత బంధు వస్తుందన్నారు. రైతుబంధు తరహాలోనే దళితులందరికీ ఈ పథకం అమలు చేస్తామన్నారు. కానీ, ముందుగా పేద వారిని […]

Update: 2021-08-16 04:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ సోమవారం హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ చేస్తున్న దళిత బంధు పథకానికి హుజురాబాద్​ ప్రాంతం ప్రయోగశాల అవుతుందని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. రాష్ట్రంలో 15 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా దళిత బంధు వస్తుందన్నారు. రైతుబంధు తరహాలోనే దళితులందరికీ ఈ పథకం అమలు చేస్తామన్నారు. కానీ, ముందుగా పేద వారిని పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. మొదటి వరుసలో ఆకలితో ఉన్న వారికి ఇవ్వాలని, చిట్టచివరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవ్వాలని, దీనికోసం నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు.

 

Tags:    

Similar News