సీల్డ్ కవర్‌లోనే మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు : కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే మూడేండ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా ఈనెల 11వ తేదీన మేయర్ ఎన్నిక ఉంటుందని, అందుకోసం ఎక్స్ అఫిషీయో సభ్యులు కార్పొరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీకి వెళ్లాలని చెప్పారు. మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు సీల్డ్ కవర్‌లో ఉంటాయని, వాటిని అక్కడే తెరవాలని స్పష్టంచేశారు. రాబోయే రెండునెలల పాటు […]
దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే మూడేండ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా ఈనెల 11వ తేదీన మేయర్ ఎన్నిక ఉంటుందని, అందుకోసం ఎక్స్ అఫిషీయో సభ్యులు కార్పొరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీకి వెళ్లాలని చెప్పారు.
మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు సీల్డ్ కవర్‌లో ఉంటాయని, వాటిని అక్కడే తెరవాలని స్పష్టంచేశారు. రాబోయే రెండునెలల పాటు ప్రతి జిల్లా తిరుగుతానని సీఎం ప్రకటించారు. అనంతరం ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించారు. ఈనెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.