సిరిసిల్లలో సీఎం సీరియస్.. రిబ్బన్ పీకేసి…

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. 12.36 నిమిషాలకు తంగెళ్లపల్లి మండలం మండేపల్లికి చేరుకున్న సీఎం డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించి ఆరుగురు లబ్దిదారులకు ఓనర్ షిప్ సర్టిఫికెట్లు అందజేశారు. అయితే ఈ గృహప్రవేశాల కార్యక్రమంలో ఓ ఇంటి గృహ ప్రవేశానికి రెడీ అయిన సీఎం కేసీఆర్‌కు అధికారులు షాక్ ఇచ్చారు. వేదమంత్రాల మధ్య దంపతులతో […]

Update: 2021-07-04 03:26 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. 12.36 నిమిషాలకు తంగెళ్లపల్లి మండలం మండేపల్లికి చేరుకున్న సీఎం డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించి ఆరుగురు లబ్దిదారులకు ఓనర్ షిప్ సర్టిఫికెట్లు అందజేశారు. అయితే ఈ గృహప్రవేశాల కార్యక్రమంలో ఓ ఇంటి గృహ ప్రవేశానికి రెడీ అయిన సీఎం కేసీఆర్‌కు అధికారులు షాక్ ఇచ్చారు. వేదమంత్రాల మధ్య దంపతులతో సహా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే రిబ్బన్ కట్ చేద్దామనుకునే సరికి కత్తెర లేకుండా పోయింది. అందరూ కత్తెర కత్తెర.. ఎక్కడంటూ అంటూ అటూ ఇటూ చూడటం మొదలు పెట్టారు. అయ్యో కత్తెర మర్చిపోయామా అని అందరూ కత్తెర కోసం వెతుకుతుంటే ఆగ్రహానికి గురైన సీఎం కేసీఆర్ వెంటనే తన చేతితో రిబ్బన్ పీకేశారు. దీంతో అక్కడున్న అధికారులు షాక్ అయ్యారు. అనంతరం రూ. 21 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కాలేజీ భవనాన్ని, ఇంటర్నేషనల్ స్కూల్, జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు.

Watch video: https://fb.watch/v/9jz2NNGH3

 

Tags:    

Similar News