సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. ధాన్యం కోసం రేపు ఢిల్లీకి

దిశ, వెబ్‌డెస్క్: వరిధాన్యం కొనుగోలు‌పై ఎన్ని సార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసినా ఉలుకు.. పలుకు లేదని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ధాన్యం కొనుగోలు అంశంపై రేపు నేరుగా ఢిల్లీకి వెళ్తున్నట్టు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పందించినట్టు ఓ లేఖ వచ్చిందని, అసలు అది నిజమా.. కాదా.. అనేది తేల్చుకునేందుకు రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉంటామన్నారు. బాయిల్డ్ రైస్ కొనమని ఆ లేఖలో ఉందని.. ఈ […]

Update: 2021-11-20 08:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరిధాన్యం కొనుగోలు‌పై ఎన్ని సార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసినా ఉలుకు.. పలుకు లేదని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ధాన్యం కొనుగోలు అంశంపై రేపు నేరుగా ఢిల్లీకి వెళ్తున్నట్టు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పందించినట్టు ఓ లేఖ వచ్చిందని, అసలు అది నిజమా.. కాదా.. అనేది తేల్చుకునేందుకు రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉంటామన్నారు. బాయిల్డ్ రైస్ కొనమని ఆ లేఖలో ఉందని.. ఈ విషయంపై అక్కడి కేంద్ర మంత్రులు, అధికారులను కలిసి అన్ని వివరాలను తెలుసుకుంటామన్నారు. అవసరమైతే ప్రధాన మంత్రిని కూడా కలుస్తామన్నారు. తదుపరి రైతులకు అన్ని విషయాలు వెల్లడిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

రైతులకు పరిహారం

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి, రైతు ఉద్యమంలో చనిపోయిన 750 మందికి నివాళులు అర్పించి, తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ. 3 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ఇస్తామని సీఎం కేసీఆర్ ‌ప్రకటించారు. ఇదే సమయంలో కేంద్రం కూడా బాధిత రైతు కుటుంబాలకు రూ. 25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కొత్త చట్టాలను వెనక్కి తీసుకున్న మోడీ.. వారికి క్షమాపణ చెబితే సరిపోదన్నారు. రైతులపై పెట్టిన దేశ ద్రోహ కేసులను వెంటనే కొట్టివేయాలని సూచించారు.

వాటాలు పంచండి..

ఏపీ-తెలంగాణ మధ్య నెలకున్న నీటి సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎవరి వాటా వారికి ఇస్తే కిరికిరి ఉండదన్నారు. ఇదే విషయంపై కేంద్ర జలశక్తి మంత్రిని ఇదివరకే కలిశానని.. రేపు మరోసారి కలుస్తానని చెప్పారు. వాటా తేల్చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదిస్తామంటూ కేసీఆర్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News