పంథా మార్చిన సీఎం కేసీఆర్..!
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంథా మారిందా? ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో గులాబీ బాస్ పలు అంశాలను వెల్లడించారు. ఇప్పటి వరకు కొట్టిపారేసిన చాలా విషయాలను ప్రస్తావించారు. బీజేపీ ఊసెత్తకుండా, కేంద్రంతో కలిసి ఉండాలనే సంకేతాలిచ్చారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలంటూ పార్టీ నేతలకు సూచించారు. అంతర్గత రాద్ధాంతాలపై కూడా కొంతమంది పార్టీ నేతలకు, ప్రజాప్రతినిధులకు చురకలంటించారు. సోషల్ మీడియా అంటేనే పడనట్లుగా […]
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంథా మారిందా? ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో గులాబీ బాస్ పలు అంశాలను వెల్లడించారు. ఇప్పటి వరకు కొట్టిపారేసిన చాలా విషయాలను ప్రస్తావించారు. బీజేపీ ఊసెత్తకుండా, కేంద్రంతో కలిసి ఉండాలనే సంకేతాలిచ్చారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలంటూ పార్టీ నేతలకు సూచించారు. అంతర్గత రాద్ధాంతాలపై కూడా కొంతమంది పార్టీ నేతలకు, ప్రజాప్రతినిధులకు చురకలంటించారు.
సోషల్ మీడియా అంటేనే పడనట్లుగా ఉండే సీఎం కేసీఆర్ ఈసారి ప్లాన్ మార్చుకున్నారు. నేతలు, ప్రజాప్రతినిధులంతా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని దిశానిర్ధేశం చేశారు. గతంలో పలుసార్లు సీఎం సోషల్ మీడియాపై ఎగతాళిగా మాట్లాడారు. హాఫ్ మైండ్గాళ్లు అని, పనీపాటా లేని వాళ్లు చేసే పని అంటూ కామెంట్ చేశారు. తాను సోషల్ మీడియాను పట్టించుకోనని చెప్పుకొచ్చారు. ఆదివారం మీటింగ్లో మాత్రం ప్రతి ఒక్కరినీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని, దీటైన కౌంటర్లు ఇవ్వాలని సూచించారు.
నో కామెంట్
రాష్ట్రంలో బీజేపీకి తామే అవకాశం కల్పిస్తున్నామా అనే సందేహంతో ఉన్న టీఆర్ఎస్ బాస్, ఈ సమావేశంలో మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీపై పదేపదే విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయలేదు. తన మంత్రివర్గం, ఎమ్మెల్యేల మీదనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని చెప్పేవి ఉంటాయి, మరికొన్ని చెప్పనవి ఉంటాయి, రాష్ట్ర అవసరాల కోసం కేంద్రంతో మాట్లాడాల్సి ఉంటుంది, టీఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు ఉంది అని వ్యాఖ్యానించారని పమాచారం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా పోరాటం చేస్తామంటూ పార్టీ నేతలకు స్పష్టం చేశారు.
పల్లా ఖరారు
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి అభ్యర్థిని త్వరలో ఖరారు చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కష్టపడాలని సూచించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగానూ ఉన్నారు. ఆయన ఇప్పటికే ప్రచారం కూడా చేసుకుంటున్నారు.