వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో 5రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం.. పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలో వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితులు ఉత్పన్నం […]

Update: 2020-08-15 05:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో 5రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం.. పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలో వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితులు ఉత్పన్నం కావొచ్చని ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌ నగరంలో రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News