లాక్ డౌన్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష
దిశ, న్యూస్ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్(కొవిడ్ 19) నివారణా చర్యల్లో భాగంగా అనుసరించాల్సిన విధివిధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలకు అనుగుణంగా స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలనీ, తద్వారా కరోనా కట్టడిలో సహకరించాలని ప్రజలను కోరారు. ఇప్పటికే కేంద్రం లాక్డౌన్ విషయంలో పలు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపైనా […]
దిశ, న్యూస్ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్(కొవిడ్ 19) నివారణా చర్యల్లో భాగంగా అనుసరించాల్సిన విధివిధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలకు అనుగుణంగా స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలనీ, తద్వారా కరోనా కట్టడిలో సహకరించాలని ప్రజలను కోరారు. ఇప్పటికే కేంద్రం లాక్డౌన్ విషయంలో పలు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపైనా ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నివారణ చర్యలు, లాక్డౌన్ పరిస్థితులను సంబంధిత అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారితో పాటు సెకండరీ కాంటాక్ట్ అవకాశం ఉన్నవారందరి ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని వైద్య అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: corona, lockdown, telangana, cm kcr review meeting, with officers, health minister