గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. హైదరాబాద్ గొప్ప చారిత్రక, అందమైన పూలబొకే లాంటి నగరమని, ఇలాంటి నగరాన్ని మరింత ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య ఉండేదని, కానీ ప్రస్తుతం జంటనగరాల్లో ఎలాంటి తాగునీటి కొరత లేదన్నారు. అన్నివర్గాలకు ఆలవాలంగా హైదరాబాద్ ఉందని, సామరస్యక పూర్వ వాతావరణంలో జంట నగరాలను అభివృద్ధి చేస్తామని, త్వరలో జీహెచ్ఎంసీకి సమగ్రమైన […]
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. హైదరాబాద్ గొప్ప చారిత్రక, అందమైన పూలబొకే లాంటి నగరమని, ఇలాంటి నగరాన్ని మరింత ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య ఉండేదని, కానీ ప్రస్తుతం జంటనగరాల్లో ఎలాంటి తాగునీటి కొరత లేదన్నారు. అన్నివర్గాలకు ఆలవాలంగా హైదరాబాద్ ఉందని, సామరస్యక పూర్వ వాతావరణంలో జంట నగరాలను అభివృద్ధి చేస్తామని, త్వరలో జీహెచ్ఎంసీకి సమగ్రమైన చట్టం తీసుకువస్తామని వెల్లడించారు.
టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలు:
హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా మంచినీటి సరఫరా
డిసెంబర్ నుంచి మంచినీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు: కేసీఆర్
20వేల లీటర్ల వరకు పూర్తిగా ఉచితంగా మంచినీళ్లు
సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్‌లకు ఉచిత విద్యుత్
ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మోటార్ వాహన పన్ను మాఫీ
రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో షోలు పెంచుకునేందుకు అనుమతి
రూ.10కోట్ల లోపు బడ్జెట్ సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్ మెంట్ సాయం
రూ.13వేల కోట్ల వ్యయం అంచనాతో సమగ్ర సీనరేజ్ మాస్టర్ ప్లాన్
రూ.12వేల కోట్ల అంచనాతో నగరంలో వరదనీటి నిర్వహణకు మాస్టర్ ప్లాన్
బీహెచ్ఈఎల్- మెహిదీపట్నం మెట్రో రైలు విస్తరణ
రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో
ఎస్ఆర్‌డీపీ 2,3 దశల్లో భాగంగా సిగ్నల్ ఫ్రీ రోడ్లు
గమ్యానికి త్వరగా చేరుకునేలా 125 లింక్‌రోడ్ల ప్రతిపాదన
హైదరాబాద్‌ను జీరో కార్భన్ సిటీగా మార్చేందుకు ఎలక్ట్రిక్ బస్సులు
నగరం నలువైపులా బస్తీ దవఖానాలు
హైదరాబాద్‌లో మరో మూడు టిమ్స్ ఏర్పాటు
40వేల మంది సినీ కార్మికులకు హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు
తాగునీటి అవసరాలకు త్వరలోనే కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మాణం
రూ.13వేల కోట్ల వ్యయ అంచనాతో సమగ్ర సీనరేజ్ మాస్టర్ ప్లాన్
టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టో కోసం ఇక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి