ఈ స్థలంలోనే 50 వేల మందితో సీఎం కేసీఆర్ బహిరంగ సభ: నిరంజన్ రెడ్డి
దిశ, వనపర్తి: ఆదివారం తెల్లవారుజామున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించారు. జిల్లా అధికారుల కార్యాలయాల సమీకృత భవనాల సముదాయ పనులను, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, నూతన వ్యవసాయ మార్కెట్ నిర్మాణ పనులను, టీఆర్ఎస్ భవన్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ నాయకులకు సీఎం కేసీఆర్ పర్యటనపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనం నిర్మాణం అవుతున్న ప్రదేశంలోనే 50 వేల […]
దిశ, వనపర్తి: ఆదివారం తెల్లవారుజామున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించారు. జిల్లా అధికారుల కార్యాలయాల సమీకృత భవనాల సముదాయ పనులను, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, నూతన వ్యవసాయ మార్కెట్ నిర్మాణ పనులను, టీఆర్ఎస్ భవన్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ నాయకులకు సీఎం కేసీఆర్ పర్యటనపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనం నిర్మాణం అవుతున్న ప్రదేశంలోనే 50 వేల మందితో బహిరంగసభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట సీఐ ప్రవీణ్ కుమార్, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్, ఆవుల రమేష్, పుర కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.