కొండపోచమ్మసాగర్‌కు నీళ్లు రావాలి

దిశ, న్యూస్‌బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విద్యుత్ శాఖ తొలి నుంచి ఆదర్శంగా పనిచేస్తోందని సీఎం కేసీఆర్ కితాబిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సిద్ధిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌ దాకా వచ్చిన గోదావరి నీళ్లను ఈ వానాకాలంలోనే కొండపోచమ్మ సాగర్‌కు తరలించాలన్నారు. దీనికిగాను విద్యుత్ శాఖ చేస్తున్న ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లాలోని అక్కారం, మర్కుక్ పంపు హౌజుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాన్స్‌కో ఎండీ ప్రభాకర్ రావుకు సీఎం గురువారం ఫోన్ చేసి […]

Update: 2020-04-23 06:44 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విద్యుత్ శాఖ తొలి నుంచి ఆదర్శంగా పనిచేస్తోందని సీఎం కేసీఆర్ కితాబిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సిద్ధిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌ దాకా వచ్చిన గోదావరి నీళ్లను ఈ వానాకాలంలోనే కొండపోచమ్మ సాగర్‌కు తరలించాలన్నారు. దీనికిగాను విద్యుత్ శాఖ చేస్తున్న ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లాలోని అక్కారం, మర్కుక్ పంపు హౌజుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాన్స్‌కో ఎండీ ప్రభాకర్ రావుకు సీఎం గురువారం ఫోన్ చేసి మాట్లాడారు. రంగనాయకసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించేందుకు జరుగుతున్న లిఫ్టు పనులపై ఆరాతీశారు. నాలుగైదు రోజుల్లో లిఫ్టులన్నీ సిద్ధం చేయాలని కోరారు.

అంతకుముందు అక్కారం, మర్కుక్ పంపు హౌజులను ఆకస్మిక తనిఖీలు చేసిన ప్రభాకర్ రావు అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ వానా‌కాలంలోనే కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలించాలని సీఎం పట్టుదలతో ఉన్నందున అందుకు తగ్గట్టు వాటిని సిద్ధం చేయాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ ‘ప్రస్తుతం కాళేశ్వరం నీళ్లు రంగనాయకసాగర్ వరకు విజయవంతంగా చేరుకున్నాయి. అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు, తర్వాత కొండ పోచమ్మ సాగర్‌కు నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన లిఫ్టులను విద్యుత్ శాఖ యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తోంది. అక్కారంలో 162 మెగావాట్ల సామర్థ్యం కలిగిన(6×27) పంపుసెట్లు సిద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి నీరు మర్కుక్ చేరుకుంటుంది. మర్కుక్ నుంచి నీటిని ఎత్తిపోయడానికి 204మెగావాట్ల సామర్థ్యం కలిగిన(6×34)కలిగిన పంపులు రెడీ అయ్యాయి. దీని కోసం 4 బృందాలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయి. టెస్టింగ్ పూర్తి చేసి నాలుగైదు రోజుల్లోనే ఈ పంపులను సిద్ధం చేస్తాం’ అని ఎండీ చెప్పారు. పంపుహౌజుల కేబుల్ పనులు చేయాల్సిన కంపెనీ టీం లాక్‌డౌన్ వల్ల ముంబైలో చిక్కుకుంటే తాను రాష్ట్ర డీజీపీకి లేఖ రాయగా, డీజీపీ మహారాష్ట్ర డీజీపీతో ఫోన్‌లోమాట్లాడి ఆ టీం రావడానికి ప్రత్యేక అనుమతి ఇప్పించారని ఎండీ చెప్పారు. ప్రస్తుతం వారి ఆధ్వర్యంలో పంపు హౌజు కేబుల్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పంపు హౌజుల తనిఖీల సందర్భంగా ట్రాన్స్‌కో ఎండీ వెంట జేఎండీ సి.శ్రీనివాస‌రావు, డైరెక్టర్ జె.సూర్యప్రకాశ్, ఈడీ పి.వి ప్రభాకర్ రావు, ఎస్.ఇలు ఆంజనేయులు, వేణు తదితరులున్నారు.

tags: telangana, cm kcr, kaleshwaram, transco, prabhakarrao

Tags:    

Similar News